- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో కరోనా విలయతాండవం.. అమెరికా కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఊహించని రీతిలో రోజూ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్రభయబ్రాంతులకు గురవుతున్నారు. ఇండియాలో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా నుంచి ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించింది. మే 4 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి తెలిపారు. తమ దేశ అంటువ్యాధుల నివారణా కేంద్రం సలహాపై ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇటీవలే భారత దేశంలో ఉన్న అమెరికన్లను ఇండిమా వదిలి రావాలంటూ అమెరికా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండియాకు వెళ్లరాదని కూడా అమెరికన్లను కోరింది. కాగా, అమెరికాతో పాటు ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, యూకే, హాంకాంగ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఇండియా నుంచి వచ్చే విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.