Perni Jayasudha : నేడు విచారణకు రావాలి : పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-01 05:23:03.0  )
Perni Jayasudha : నేడు విచారణకు రావాలి : పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) భార్య పేర్ని జయసుధ(Perni Jayasudha)కు పోలీసులు మరోసారి నోటీసు(Notices)లు జారీ చేశారు.రేషన్ బియ్యం మాయం కేసు(Ration Rice Theft Case)లో విచారణకు రావాలని నోటీసులు అందించారు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇంటికి అంటించారు. నోటీసులో జయసుధను బందర్ తాలుకా పోలీస్ స్టేషన్ కు ఈ రోజు రావాలని పేర్కొన్నారు. ఇదే కేసులో జిల్లా కోర్టు ఇటీవల ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు సహకరించాలని ఇప్పటికే జిల్లా కోర్టు సూచించింది. జయసుధ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించారు. పేర్ని నాని ఈ జరిమాన మొత్తాన్ని చెల్లించారు. ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. మొత్తం మీద గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు తేల్చారు. ఈ క్రమంలో బియ్యం నిల్వల లెక్కల మేరకు జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధను ఏ1గా, మేనేజర్‌ మానస తేజ్‌ను ఏ2గా చేర్చారు. ఇప్పటికే మానస్‌ తేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డిని సైతం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed