Megastar Chiranjeevi: ‘భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి’: మెగాస్టార్

by Anjali |   ( Updated:2025-01-02 15:31:57.0  )
Megastar Chiranjeevi: ‘భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి’: మెగాస్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రజెంట్ చిరంజీవి విశ్వంభర(Viśvambhara) చిత్రంలో నటిస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం వేళ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన అభిమనానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ బై బై 2024 & స్వాగతం 2025.. కొత్త సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు, జీవితం & కెరీర్ లక్ష్యాలు అలాగే వాటన్నింటిని సాకారం చేసుకునేందుకు డ్రైవ్ & ఎనర్జీని అందించాలి. భారతీయ సినిమా వైభవం మరింత ప్రకాశవంతంగా విస్తరించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరమంతా ప్రేమ, నవ్వు.. కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకోండి’ అంటూ అభిమానులకు చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.


Click Here For Tweet..

Advertisement

Next Story

Most Viewed