రైతుల పోరాటానికి ఐరాస మద్దతు

by Shamantha N |
రైతుల పోరాటానికి ఐరాస మద్దతు
X

న్యూయార్క్: ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు ఐక్యరాజ్యసమితి మద్దతు తెలిపింది. ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉంటుందని, అధికారులు ఆ హక్కును కాలరాయవద్దని సూచించింది. భారత్‌లో రైతుల ఆందోళనలపై ప్రశ్నకు ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి స్టెఫానీ దుజారిక్ స్పందించారు. ఇది వరకే ఆందోళనలపై ఐరాస స్పష్టం చేసిన విషయాన్నే మరోసారి చెబుతున్నారని పేర్కొంటూ, ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టే హక్కు ఉంటుందని, అధికారులూ వారి హక్కులకు అడ్డురావద్దని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed