మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు

by Sumithra |
chain snatching
X

దిశ, పాలేరు: నేలకొండపల్లి మండలం ఆచర్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం సాయంత్రం ఓ మహిళ మెడలో బంగారు గొలుసును, గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు కు చెందిన మాతంగి సుగుణమ్మ అనే మహిళ భర్త లక్ష్మయ్యతో కలిసి కృష్ణా జిల్లా తక్కెళ్ళపాడులో తన కుమార్తె వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తు్న్నారు. ఈ తరుణంలో సుగుణమ్మ మెడలో 2తులాల బంగారపు తాడును ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు.

దీనితో బాధితులు నేలకొండపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకొని, వివిధ కూడళ్లలో ఉన్న సీపీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. గత మూడు నెలల క్రితం వరుసగా కూసుమంచి పోలీస్ సర్కిల్ పరిధిలో 6 గొలుసు చోరీలు జరిగాయి. కానీ ఎటువంటి పురోగతి జరగలేదు. వరుసగా మహిళలనే టార్గెట్ చేస్తూ ద్విచక్ర వాహనంపై వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. దుండగులు పథకం ప్రకారం చోరీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.

Advertisement

Next Story