- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు గుడ్ న్యూస్.. హైకోర్టు తీర్పుతో సర్కార్ అలర్ట్..
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పరిహారం చెల్లించనున్నట్లు 2018-19లో జీవో జారీచేసినా ఇప్పటికీ సాయం అందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్, తదుపరి విచారణ జరిగే సమయానికి నిధులను విడుదల చేయాలని, లేని పక్షంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి స్వయంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
దీంతో ఆగమేఘాల మీద కదిలిన వ్యవసాయ శాఖ కార్యదర్శి 2018-19 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా పరిహారాన్ని రూ. 146.32 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల నుంచి విడుదల చేశారు.కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రాలకు తప్పనిసరి కాకుండా ‘ఆప్షనల్’ అనే వెసులుబాటు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెండేళ్ళుగా అమలుచేయడంలేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి పరిహారం అందడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాటా ధనం విషయంలో తేడాలు రావడంతో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ పథకం రావడానికి ముందు నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్సు స్కీమ్, మాడిఫైడ్ స్కీమ్, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీములు అమలులో ఉండేవి. కానీ ఫసల్ బీమా యోజన రావడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం దూరం పెట్టింది. కానీ ఈ పథకం ఆప్షనల్ కావడంతో రాష్ట్రంలో అమలు కావడం లేదు. రైతులకు ఏ రూపంలోనూ పంట నష్టానికి బీమా పరిహారం అందడంలేదు.