- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అన్ని రాష్ట్రాలు రూ. 50 వేలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనాతో మరణించినట్లు ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఇస్తామని మార్గదర్శకాల్లో తెలిపింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ధ్రువీకరణ పత్రం లేకున్నా పరిహారం ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కరోనాతో చనిపోయిన కుటుంబాలకు జాతీయ విపత్తుల నిర్వాహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని డెత్ సర్టిఫికేట్లో కరోనాతో చనిపోయినట్లు లేకపోయినా.. పరిహారం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేసింది. ఇదివరకే డెత్ సర్టిఫికేట్ జారీ చేస్తే.. దానిలో మార్పుల కోసం సంబంధిత విభాగానికి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చని బాధితులకు సూచనలు చేసింది. ఈ విషయంపై మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.