కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది

by Shyam |
కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 2015-16 తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.799 కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే రాజాసింగ్​తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆ డబ్బు అందించకుండా ఏడాది పాటు అడ్డుకుందన్నారు. గులాబ్​తుఫాన్​కారణంగా పంటనష్టం జరిగి అన్నదాతలు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

2017లో రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఫసల్​బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించక పెండింగ్‌లో ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్సిడీలు అందించడంలేదన్నారు. రాయితీలు, ఫసల్​బీమాలాంటి పథకాలను రైతులకు వర్తింపజేస్తే రాష్ట్రంలో రైతుల చావులుండవని చెప్పారు. రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఇప్పటి వరకు రూ.25వేలు మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన మొత్తాన్ని కూడా మాఫీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని​డిమాండ్​చేశారు.

ధూల్‌పేట ప్రజలపై గుడుంబా, గంజాయి అమ్ముతున్నారని పోలీసులు దాడులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలా నిజంగా తప్పులు చేసిన వారిని శిక్షించవచ్చు.. కానీ అతడి కుటుంబసభ్యులను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, నిర్దోషులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నారు.

Advertisement

Next Story