మందులోకి నీళ్ళు ఇవ్వరా … నేను ఎవరో తెలుసా ?

by Shyam |   ( Updated:2021-04-04 21:50:00.0  )
మందులోకి నీళ్ళు  ఇవ్వరా … నేను ఎవరో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో మందుబాబుల ఆగడాలకు హద్దులు లేకుండా పోయింది. నేను ఎవరో తెలుసా అంటూ.. ఓ పోలీసు అధికారి కుమారుడు అతని స్నేహితుడితో కలసి రోడ్డు పై హల్ చల్ చేశారు. రోడ్డు పక్కన సోడాలు అమ్మే వ్యక్తితో మందులో కలుపుకోవడానికి నీళ్లు ఇవ్వాలి అంటూ గొడవకు దిగారు. ఈ ఘటన కేపీహెచ్ బీ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. నేను ఎవరో తెలుసా పోలీసు ఆఫీసర్‌ కొడుకుని..అంటూ ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వైపు ప్రయాణిస్తున్నారు. అయితే కేపీహెచ్‌బీలోని పెట్రలో బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్ద వీరు కారు ఆపారు. కారులో నుంచి మందు గ్లాసులు పట్టుకుని దిగి.. మందులో కలుపుకోవడానికి నీళ్లు ఇవ్వాల్సిందిగా సోడాల వ్యాపారిని అడిగారు. అందుకు అతడు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని కోరాడు. అయితే వారు మాత్రం నీరు ఇవ్వాల్సిందేనంటూ నానా హంగామా చేశారు. నేను ఎవరో తెలుసా పోలీస్ అధికారి కొడుకుని అంటూ వ్యాపారిని బెదిరించాడు. అక్కడ ఉన్న మంచినీటి డబ్బాను కిందపడేశారు. దీంతో విసుగచ్చిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరి తండ్రి ఎఆర్ లో అదనపు ఎస్పీ గా పనిచేస్తన్నాడు, మరొకరు డాక్టర్ అరుణ్ వీరిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు

Advertisement

Next Story

Most Viewed