- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్10
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ(ఇస్రో) మరో శాటిలైట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగష్టు 12న అంతరిక్షంలోకి భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్10 గురువారం ఉదయం 5గం. 45నిమిషాలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. బుధవారం ఉదయం ఇస్రో అధికారక ట్విట్టర్ ఖాతా ద్వారా కౌంట్ డౌన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ ఉపగ్రహం సహాయంతో భూమికి సంబంధించిన చైనా, పాకిస్తాన్ సరిహద్దులను పర్యవేక్షించవచ్చు. దేశరక్షణ, విపత్తు నిర్వహణ, అటవీ, వ్యవసాయ, జలవనరులు, తుఫాన్లు, ఉపద్రవాలను ముందే పసిగట్టనుంది. ఈ ఉపగ్రహాం జీవిత కాలం 10 సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొపుల్స్యన్ సిస్టం సహాయంతో ఈ ఉపగ్రహాం చివరి జియోస్టేషనరి క్షక్ష్యను చేరుకోనుంది. ఇది జీఎస్ఎల్వీలో 14 ఉపగ్రహం కాగా, మొదటి సారిగా ఇందులో 4 మీటర్ల వ్యాసం ఉన్న ఫెయిలింగ్ లోడ్ ఆకారాన్ని ఉపగ్రహాన్ని రక్షించడానికి ఉపయోగిస్తున్నారు. ఉపగ్రహం బరువు 2268 కిలోలు.