- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూటీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి..
దిశ, బోథ్ : స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరి మృతి చెందగా మరొకరి తీవ్రగాయాలైన ఘటన నిర్మల్ జిల్లాలోని ఘాట్ సెక్షన్ వద్ద చోటు చేసుకుంది. బోథ్ మండలానికి చెందిన కీర్తన్ (23), మన్పురి నవీన్‌లు స్కూటీపై వ్యక్తిగత పనుల మీద నిర్మల్‌కు వెళ్తున్నారు. అయితే బోథ్ నుండి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ సెక్షన్ లో వెనక నుండి వచ్చి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న కీర్తన్, నవీన్ లు కిందపడిపోయారు.
కీర్తన్‌కు చెవులు, ముక్కుల నుండి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఏరియా ఆసుపత్రికి తరలించగా మరణించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అటు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులలో విషాద చాయలు అలుముకున్నాయి. అందరితో కలిసి ఉండే కీర్తన్ ఇలా చనిపోవడం చాలా బాధాకరం అని దుర్గ కమిటీ సభ్యులు సంతాపం తెలిపారు.