- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధి మిస్టరీని ఛేదించిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో ట్రంక్ పెట్టేలో నిధిని దాచిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సొమ్ము ఎవరిది అని పోలీసులు విచారణ చేపట్టి ఎట్టకేలకు చేధించారు. పెట్టెల్లో దాచిన బంగారం, వెండి, నగదు ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కు సంబంధించినవిగా నిర్ధారించారు.
దీంతో ఈ కేసును మరింత లోతుగా చేస్తున్నారు. బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లోని నిధిని పోలీసులు లెక్కించారు. ముగ్గురు డీఎస్పీలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో 8 పెట్టెలు తెరిచి, 2.4 కిలోల బంగారం, 24 కేజీల వెండి, రూ.15.55 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా రూ.27 లక్షల విలువైన ప్రాంసరీ నోట్లు, రూ. 49 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను గుర్తించారు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ తన దగ్గర పనిచేసే డ్రైవర్ నాగలింగం, మామ అయిన బాలప్ప ఇంట్లో ఈ నిధిని దాచినట్టు పోలీసులు గుర్తించారు.