- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో అస్వస్థతకు గురైన పోలీసులు
దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలలో పలువురు పోలీస్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో మంత్రి హరీశ్ రావు పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రగతి నివేదికను చదివి వినిపించారు.
ఈ క్రమంలో కొంతమంది పోలీస్ సిబ్బంది మంత్రి హరీష్ రావు ప్రగతి నివేదికను చదివి వినిపిస్తున్న క్రమంలో ఎండలో ఎక్కువ సమయం నిలబడి ఉండడంతో సృహ కోల్పోయి పరేడ్ నుండి వెనుదిరిగి పోయారు. పరిస్థితిని గమనించిన పోలీస్ ఉన్నత అధికారులు వెంటనే స్పందించి నీళ్ళు త్రాగించి, ఇతర పోలీస్ సిబ్బంది సహాయంతో అక్కడే ఉన్న అంబులెన్స్ లో చికిత్స అందించారు. ఎండ వేడిమి తట్టుకోలేక పోలీస్ సిబ్బంది అల్లాడి పోయారు. పరేడ్ లో ఉన్న పోలీస్ సిబ్బంది మధ్య మధ్యలో నీళ్ళు త్రాగుతూ పరేడ్ నిర్వహించారు.