Pavan Kalyan: పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
Pavan Kalyan: పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించిన పిఠాపురం (Pithapuram) ప్రజలకు రుణపడి ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Deputy CM Pavan Kalyan) అన్నారు. ఇవాళ ఆయన పిఠాపురం నియోకవర్గం (Pithapuram Constituency)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మట్లాడుతూ.. నియోజకవర్గంలో సంక్రాంతి (Sankranthi) సంబురాలను అద్భుతంగా నిర్వహించాలని అనుకున్నామని అన్నారు. కానీ, తిరుమల (Tirumala)లో జరిగిన తొక్కిసలాట ఘటనతో వేడుకలను అంత ఘనంగా చేయడం లేదని తెలిపారు. కూటమి విజయం అంటే ప్రజలకు గెలుపని.. రాష్ట్రం గెలుపని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రజల ఆశీర్వాదాలతో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయని తెలిపారు.

గత ప్రభుత్వ పెద్దలు తమ పాలనపై తృప్తి లేదని అంటున్నారని.. ఆరు నెలల్లో తాము ఏం చేశామో చెబుతామన్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో 260 గోకులాలు (Gokulams) నిర్మించారని.. తాము గత ఆరు నెలల్లోనే 12,500 గోకులాలు నిర్మించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమూల్‌ (Amul)ను తీసుకొచ్చి.. ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని ఆరోపించారు. గుజరాత్‌ (Gujarat)లో గోకులాల ద్వారా రూ.60 వేల కోట్లు వ్యాపారం జరుగుతోందని తెలిపారు. ఏపీలో పాడి రైతులు గుజరాత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. గోవులు, గోకులాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. వైసీపీ సర్కార్ (YCP Government) స్కాముల్లో రికార్డ్ సృష్టిస్తే.. తమ ప్రభుత్వం పెన్షన్ల పెంపు, అభివృద్ధిలో రికార్డులు సృష్టిస్టున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed