అమెరికాలోనే వైరస్ మూలాలు పరిశీలించాలి

by vinod kumar |
అమెరికాలోనే వైరస్ మూలాలు పరిశీలించాలి
X

బీజింగ్: కరోనా వైరస్ మూలాల కోసం అమెరికాలోనే అధ్యయనం చేయాలని చైనా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులను అమెరికాకే ఆహ్వానించాలని, ప్రపంచవ్యాప్తంగా వారికి చెందిన సుమారు 200 బయోల్యాబ్ వివరాలను అందించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధనలు చేసిన పరిశోధకుల ఆరోగ్య సమస్యలపై వివరాలు అందించాలని అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోని ఫౌచీ డిమాండ్ చేస్తూ పలు మెయిల్స్ పంపారు. వీటిపై స్పందిస్తూ 2019 డిసెంబర్ 30వ తేదీకి ముందు వుహాన్ ల్యాబ్ పరిశోధకులెవరూ అనారోగ్యానికి గురికాలేదని వెన్‌బిన్ వివరించారు. అమెరికానే డబ్ల్యూహెచ్‌వో అధికారులను ఆహ్వానించి సైన్యం అధీనంలోని ఫోర్ట్‌ డెట్రిక్ ప్రాంతంలోని బయోల్యాబ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి గల 200కు పైగా ల్యాబ్‌ల వివరాలు సమర్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story