కాంగ్రెస్ కాదు..అసలు కరోనా కేసీఆరే

by Shyam |
కాంగ్రెస్ కాదు..అసలు కరోనా కేసీఆరే
X

దిశ, న్యూస్ బ్యూరో:
కోవిడ్-19(కరోనా)తో కాంగ్రెస్ పార్టీని పోలుస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అసెంబ్లీలో కరోనా వైరస్‌‌పై చర్చలో సీఎం సంయమనం కోల్పోయి మాట్లాడారన్నారు. ప్రజారోగ్యంపై కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని దూషించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించారని, ఆ విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు. అసలు తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యేవాడని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తుంటే దానికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, పారాసిటామల్ టాబ్లెట్ తో తగ్గుతుందని, తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువ కావున వైరస్ బతకదని చెప్పడం తన నిర్లక్ష ధోరణికి నిదర్శనమన్నారు. కేసీఆర్ చెప్పింది నిజమే అయితే రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ఎందుకు ప్రకటించారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీ రికార్డుల నుంచి ఆ మాటలను తొలగించాలన్నారు.

Tags :congress, uttam, kcr, assembly, coronavirus

Advertisement

Next Story

Most Viewed