అక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యేనా?

by Aamani |   ( Updated:2021-10-22 02:44:39.0  )
అక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యేనా?
X

దిశ, పిట్లం : ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంట మార్కెట్ కమిటీకి తరలి వస్తున్నా.. కొనుగోలు కేంద్రం పై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. పిట్లం మండలం‌లో రైతులు వరి ధాన్యం కోతలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేస్తుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడం‌పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో రాంపూర్, చిల్లర్గి, పిట్లం, కారేగం, తిమ్మా నగర్, కుర్తి గ్రామాలలో పంట చేతికి వచ్చి కోతలు ప్రారంభించిన రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు వరి ధాన్యానికి సరిపడా స్థలాలు లేక రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed