- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రమ్య హత్య కేసు: రంగంలోకి దిగిన కమిషన్ బృందం
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రంగంలోకి దిగింది. వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి రానుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి గుంటూరుకు రానున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఈనెల 24న ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించనున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌లతో భేటీ కానున్నారు. హత్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకుని నివేదికను రూపొందిచనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story