వందేళ్ల జాతీయ జెండా పండుగలేవీ?

by Shyam |
congress leader VH
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు జాతీయ జెండా వందేళ్ల పండుగను మరిచిపోయారని, ఏప్రిల్ 1న విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేస్తామని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించడం సంతోషమే కానీ, తెలుగువాడు పింగిళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాకు వందేళ్లయిన సందర్భంగా వేడుకలను విస్మరించడం అన్యాయం, అవమాన కరమన్నారు. 1921 ఏప్రిల్ 1న విజయవాడ ఏఐసీసీ సమావేశంలో తొలిసారి మహాత్మాగాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారని, అదే రోజు జింఖానా గ్రౌండ్‌లో జెండాను ఆవిష్కరిస్తామని తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ ఎంపీ హర్ష కుమార్ పాల్గొంటారని తెలిపారు. రాబోయే తరాలకు జెండా సృష్టి కర్త పింగళి వెంకయ్య గురించి తెలపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed