- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, అమరచింత: వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రం లోని లతీఫ్ మీ సేవ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్‌కు, మున్సిపల్ వైస్ చైర్మన్ బెదిరింపు కాల్ చేశారు.11 నెలల క్రితం ఇసుక బుక్ చేయడానికి,రూ.2700 మీ సేవ నిర్వాహకుని అకౌంట్ నుంచి కట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు మున్సిపల్ వైస్ చైర్మన్ జీ ఎస్ గోపికి, మీ సేవ నిర్వహకుడు డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా, తన నెంబర్‌ను బ్లాక్ చేశాడని, ఎన్నిసార్లు ఎదురుపడి అడిగిన వైస్ చైర్మన్ పట్టించుకోలేదని ఆపరేటర్ భాస్కర్ తెలిపారు.
ఈ విషయాన్ని స్థానికుల దృష్టికి తీసుకెళ్లడంతో సదరు వ్యక్తికి వైస్ చైర్మన్ ఫోన్ చేసి.. దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడు తనను డబ్బులు అడిగినందుకు గాను మీ సేవ ఎలా నడుపుతారో చూస్తానంటూ.. బెదిరింపులకు పాల్పడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కమ్యూనిస్టు పార్టీ లో జిల్లా నాయకులుగా కొనసాగుతున్న జీఎస్ గోపి, బాధ్యతగల మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా ఉంటూ, ఇలా బెదిరింపులకు పాల్పడడం పలు విమర్శలకు తావిస్తోంది.