చైనా యాప్స్‌కు ప్రత్యామ్నాయాలు ఇవే

by Shamantha N |
చైనా యాప్స్‌కు ప్రత్యామ్నాయాలు ఇవే
X

దిశ, హైదరాబాద్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణం, ఇటీవల ఇండియా- చైనా సరిహద్దులో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితులు నగర ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. భారత సైనికులపై దాడి చేసి 20 మందిని పొట్టనపెట్టుకోవడంతో చైనా అంటేనే మండిపడుతున్నారు ప్రజలు. చైనాను అన్ని విధాలుగా బహిష్కరించాలని సోషల్ మీడియా వేదికగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చైనా వస్తువులు, యాప్స్‌ను బహిష్కరించాలని ఉద్యమం చేపట్టారు. అయితే చాలా మందికి చైనా యాప్స్ ఏవో తెలియటం లేదు. ఈ నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్స్‌ను వినియోగించాలని అంతటా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చైనా యాప్స్ – ప్రత్యామ్నాయాలు

1. టిక్‌టాక్‌ – బోలో ఇండియా, రోపోసో
2. పబ్జీ – కాల్ ఆఫ్ డ్యూటీ, గరేనా ఫ్రీ‌ ఫైర్
3. హలో – షేర్‌చాట్
4. షేర్‌ఇట్‌, జెండర్ – గూగుల్ ఫైల్స్
5. యూసీ బ్రౌజర్‌ – గూగుల్ క్రోమ్
6. కామ్‌స్కానర్‌ – అడోబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్ లెన్స్
7. బ్యూటీ ప్లస్‌ – బి 612 బ్యూటీ అండ్ ఫిల్టర్ కెమెరా, కాండీ కెమెరా
8. క్లబ్ ఫ్యాక్టరీ, షీన్ – ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, కూవ్స్,
9. యాప్‌లాక్‌ – నార్టన్ యాప్ లాక్
10. వీవా వీడియో – కైన్ మాస్టర్, అడోబ్ ప్రీమియర్ రష్
11. లైవ్‌మీ, క్వాయ్ – పెరిస్కోప్
12. యూసీ న్యూస్‌ – గూగుల్ న్యూస్
13. ప్యార్లల్ స్పేస్ – యాప్ క్లోనర్

Advertisement

Next Story