- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణా జిల్లాలో దారుణం.. పసికందు అని చూడ కుండా..
దిశ, వెబ్‌డెస్క్ : అమ్మ తన ఒడిలో గారాబంగా చూసుకోవాల్సిన చిన్నారిని చెట్ల పొదల పాలు చేసింది. కంటికి పాపల చూడాల్సిన కన్నతల్లి కసాయిలా మారి ఆడ శిశువును అనాథను చేసింది. ఆడపిల్ల అని భారంగా భావించిందో.. లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ, రోజుల వయసున్న చిన్నారిని చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లింది ఓ తల్లి.
వివరాల్లోకి వెళ్లితే.. కృష్ణా జిల్లా పామర్రు మండలం రిమ్మన పూడిలోని అంకామ్మగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామం శివారులో వ్యవసాయ పనుల నిమత్తిం వెళ్తున్న స్థానికులకు ఓ ఆడ శిశువు ఏడుపు వినిపించింది. దీంతో వారు అక్కడ వెతకగా ఓ చెట్ల పొదల్లో చిన్నారిని గుర్తించారు. వెంటనే పామర్రు ఎస్‌ఐ పండుదొరకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ వచ్చి రోజుల వయస్సు శిశువుగా గుర్తించి ఐసీడీఎస్ అధికారుల ద్వారా మచిలీపట్నంలోని శిశు సంరక్షణ కేంద్రానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.