32 వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

by Shamantha N |   ( Updated:2021-03-17 02:19:36.0  )
32 వేల అడుగుల ఎత్తులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
X

దిశ,వెబ్ డెస్క్: బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి సుమారు 180 మంది ప్రయాణికులతో ఈ తెల్లవారు జామున ఇండిగో విమానం 6ఈ-469 జైపూర్‌కు టేకాఫ్ తీసుకుంది. అంతా తమ సీట్లలో కూర్చొని ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. విమానం సగం దూరం వెళ్ళిపోయింది. ఇంతలో విమానంలో ఉన్న ఒక నిండు గర్భిణీకి ప్రసవ వేదన మొదలయ్యింది. పురిటి నొప్పులతో ఆ మహిళ విలవిలాడిపోయింది. దీంతో అలెర్ట్ అయిన విమాన సిబ్బంది విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ సాయంతో ఆమెకు సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

భూమికి 32 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోన్న సమయంలో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానం జైపూర్ చేరుకునేసరికి వైద్య సిబ్బందిని , అంబులెన్సు ని ఎయిర్ పోర్ట్ లో సిద్ధం చేసారు. బిడ్డతో జైపూర్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఆ మహిళను ఇండిగో అధికారులు గిఫ్ట్ కార్డు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed