- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురుతో అలా చేస్తున్న ప్రియుడిని చూసిన తల్లి తట్టుకోలేక.. ఆ రాత్రి!
దిశ, వెబ్‌డెస్క్ : తల్లితో అక్రమ సంబంధం నడిపిస్తున్న ఓ వ్యక్తి ఆమె కూతురుపై కన్నేశాడు. వావివరసలు మరిచి ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ కామాంధుడి వక్రబుద్దిని పసిగట్టిన తల్లి పక్కా ప్లాన్‌తో మట్టుబెట్టింది. పంజాబ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెళ్లడించారు. వారి కథనం ప్రకారం..
ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ ఉద్యోగం చేస్తోంది. పఠాన్ కోట్‌కు చెందిన ఆమె భర్త అదే కంపెనీలో ఉద్యోగం చేస్తూ 2019లో మరణించాడు. కంపెనీ భర్త ఉద్యోగాన్ని భార్యకు ఇవ్వడంతో రెండేళ్లుగా పని చేస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు. కాగా అదే కంపెనీలో పని చేసే పవన్‌తో సదరు మహిళకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. మహిళకు భర్త లేకపోవడంతో రెండేళ్లుగా బల్లాబ్‌ఘర్‌లో అతడితోనే ఉంటూ సహజీవనం చేస్తోంది. ఆమె ఇద్దరు కూతుర్లు వారి సొంత గ్రామంలోనే ఉంటున్నారు.
కాగా, ఇటీవల ఆమె పెద్ద కూతురు (14) తల్లితో ఉంటానని బల్లాబ్‌ఘర్‌కు వచ్చింది. అయితే తల్లితో సహజీవనం చేస్తున్న పవన్ ఆ బాలికను కూతురులా చూసుకోవాల్సింది పోయి.. ఆమెపై కన్నేశాడు. తల్లి లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను లొంగతీసుకునే ప్రయత్నం చేశాడు. అతడి ప్రవర్తన నచ్చని బాలిక.. తల్లి రాగానే అతడి వికృత చేష్టలను వివరించింది. దీంతో అతడితో ఆ మహిళ గొడవకు దిగింది. పద్ధతి మార్చుకోమని హెచ్చరించినా పవన్ వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇక సహించలేక పోయిన మహిళ అతడితో ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించి హత్యకు పథకం రూపొందించింది.
ప్లాన్ ప్రకారం పవన్‌ను అక్టోబర్ 16న ఢిల్లీకి తీసుకెళ్లింది. దారి మధ్యలో అతడిపై ప్రేమను నటిస్తూ.. తన కోసం ఏమైనా చేస్తావా అంటూ కోరింది. పవన్ దేనికైనా సై అనడంతో అతడికి నిద్రమాత్రలు మింగించింది. నిద్రలోకి జారుకున్న ప్రియుడిని సెక్టార్ 75 లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
మొదట నైజీరియన్‌గా అనుమానించిన పోలీసులు.. ఆ తర్వాత మృతుడు బల్లభ్‌గఢ్‌కు చెందిన పవన్‌గా గుర్తించారు. పఠాన్ కోట్ వ్యక్తి ఢిల్లీలో సజీవ దహనం కావడంపై అనుమానించిన పోలీసులు అతడి గురించి విచారణ చేయగా అక్రమ సంబంధం విషయం వెలుగు చూసింది. వెంటనే అతడితో సహజీవనం చేస్తున్ మహిళను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. హత్యకు దారి తీసిన ఘటనలను వివరించింది. 12 రోజుల తర్వాత కేసును చేధించిన పోలీసులు శనివారం మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.