- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడల్ మార్కెట్కు మోక్షమెప్పుడు?
దిశ, కూకట్‌పల్లి: ‘నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ప్రతీ కాలనీలో అన్ని వస్తువులు ఒకే భవనంలో అందుబాటులో ఉండే విధంగా వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తాం’ అంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మోడల్ మార్కెట్ నిర్మాణ నిర్ణయం నీరుగారి పోయింది. 6ఏళ్ల క్రితం శంకుస్థాపన చేపట్టి శరవేగంగా పనులు పూర్తి చేశారు. మూడేండ్ల క్రితం నిర్మాణం పూర్తయినా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. లబ్ధిదారులకు కేటాయించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మోడల్ మార్కెట్ కాస్తా మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారింది.
కూకట్‌పల్లిలోని కాలనీల్లో వ్యాపార సముదాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, స్థానికంగా ఉన్న వారికి ఉపాధి కల్పించడానికి నిర్మించిన మోడల్ మార్కెట్ కాస్తా నేడు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం మొట్ట మొద టి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడల్ మార్కెట్ల నిర్మాణంలో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీలో 2015 నవంబర్లో మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టింది. 2018లో మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయింది. మోడల్ మార్కెట్లో నిర్మించిన 18 దుకాణాలకు కొంత మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వాటిని కేటాయించారు. అయినా నేటికీ ఎవరూ ఆ దుకాణాలను ప్రారంభించలేదు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభించక పోవడంతో స్థానికంగా జులాయిలకు, మందు బాబులకు ఆ భవనం ఓ అడ్డాగా మారింది. రోజు చీకటి పడితే చాలు మోడల్ మార్కట్ ప్రాంగణంలో మద్యం సేవించడం, సిగరేట్లు కాల్చడం చేస్తున్నారు. మోడల్ మార్కెట్లో ఉన్న బాత్‌రూం తలుపులు సైతం ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆకతాయిలతో చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోలింగ్ పెంచుతాం..
మోడల్ మార్కెట్ పరిసరాల్లో రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచు తాం. ఆకతాయిల నుంచి సమ స్యను అరికడతాం. మోడల్ మార్కెట్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలు చేపడితే ఉపేక్షించేది లేదు.
–లక్ష్మీనారాయణ, సీఐ, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్