- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కుటుంబాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రులు పరామర్శించాలి
దిశ, రఘునాథపల్లి: ఇటీవల హైదరాబాద్‌లో అదృశ్యమై బెల్లంపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలిక కుటుంబాన్ని వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి కుమార్ మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన కడియం శ్రీహరి, టి.రాజయ్యలు ఘటనపై స్పందించాలని కోరారు. అంతేగాకుండా.. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, బాలిక మృతిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థికసాయం చేయాలని కోరారు. బాలిక మృతికి కారకులైన నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోతే అన్ని దళిత సంఘాలతో పాటు రాజకీయ పార్టీలను కలుపుకొని పోయి భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్, మాల మహాసభ జిల్లా అధ్యక్షులు స్వామి, జిల్లా అధికార ప్రతినిధి ధర్మయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లేష్, బీఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షులు నిర్మల రత్నం, నాయకులు రాజు , లింగ స్వామి, రవిగౌడ్, దొమ్మాట రాజు, భాస్కర్, రాజకుమార్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.