రాష్ట్రంలో మెదలైన సీనియారిటీ గలాట.. కీలక ఆదేశాలిచ్చిన విద్యాశాఖ..

by Shyam |
రాష్ట్రంలో మెదలైన సీనియారిటీ గలాట.. కీలక ఆదేశాలిచ్చిన విద్యాశాఖ..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​లేని జిల్లాల్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రకటించాలని అన్ని జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్​ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్​ఆఫ్​స్కూల్​ఎడ్యుకేషన్​కార్యాలయంలో గురువారం డీఈవోలతో విద్యాశాఖ కమిషనర్​దేవసేన, కార్యదర్శి సందీప్​కుమార్​సుల్తానియా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలు ప్రకటించాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్​ఉన్న జిల్లాల్లో శుక్రవారం సాయంత్రానికి సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ కోడ్ అనంతరం ఆప్షన్లు తీసుకోవాలన్నారు.

క్యాడర్​స్ట్రెంత్​అమలులో ఉన్న ఉత్వర్వులను అనుసరించి సీనియారిటీ దెబ్బతినకుండా స్థానికత ఆధారంగా ప్రక్రియను నిర్వహించాల్సి ఉందని, కానీ దీనికి భిన్నంగా విబజన, కేటాయింపులు చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉమ్మడి పది జిల్లాల్లో మొత్తం కలిపి ఒక లక్ష 6 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు.

దీని ప్రకారం ఒక జిల్లాకు కనీసం 10 వేల మంది ఉండే అవకాశం ఉందని ఎస్​టీయూటీఎస్, టీఆర్​టీఎఫ్​సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే జాబితా వల్ల ఉద్యోగుల్లో గందరగోళం నెలకొనకుండా మెరిట్​లిస్ట్​ను వెబ్​సైట్​లో పెట్టాలని డిమాండ్​చేశారు. తద్వారా వారి అపోహలు తొలగి పారదర్శకంగా ఉండేందుకు ఆస్కారముంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed