- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిసరాలు పరిశుభ్రం చేసిన మంత్రి
హైదరాబాద్: ‘పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఆదివారం పది నిమిషాలు’ అంటూ మున్సిపల్‌శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో సతీమణి నీరజారెడ్డితో కలిసి పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు, మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపుతో ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెరుగుతుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు దరి చేరవని ఆయన అన్నారు.