గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం

by srinivas |
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
X

దిశ, ఏపీ బ్యూరో: ఎవరైనా గుళ్లూ గోపురాలకు భూరి దానాలు ఇస్తుంటారు. కానీ గృహ నిర్మాణశాఖ మంత్రి రంగనాధరాజు మాత్రం గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను మంత్రి కొనియాడారు. జీజీహెచ్‌ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆ ఆసుపత్రిలో రోగులతో పాటు వచ్చే సహాయకులకూ రెండు పూటల భోజనం పెట్టేందుకు తనవంతు సాయం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా బాధితులకు జీజీహెచ్​అందిస్తున్న సేవలకు సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.

Advertisement

Next Story