హుజురాబాద్ పరిస్థతిపై ఈటల ఆరా

by Sridhar Babu |
హుజురాబాద్ పరిస్థతిపై ఈటల ఆరా
X

దిశ, కరీంనగర్: హుజురాబాద్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీస్తున్నారు. పట్టణంలో కార్డన్ ఆఫ్ చేసిన తరువాత ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, బయటకు రాకుండా అవగాహన కల్పిస్తున్నారా? లేదా? అంటూ ఆర్డీఓ, ఏసీపీ, ఆసుపత్రి సూపరింటిండెంట్‌లకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కరోనా మూలంగా మంత్రి ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువగా కోఠీలోని కంట్రోల్ రూంలో ఉంటూ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కూడా మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెల్లివచ్చిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో రోజూ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. డైరక్ట్ కాంటాక్ట్ అయిన వారిని, అనుమానితులను వెంటనే క్వారంటైన్‌కు తరలించారా..? లేదా..? అని ఆరా తీస్తున్నారు.

Tags: minister, coronavirus, spread, huzurabad, situation, karimnagar, markaz

Advertisement

Next Story

Most Viewed