హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం

by Shyam |
cool weather in hyd
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం వరకూ మాడు పగిలే ఎండతో చుక్కలు చూపిస్తున్న ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా మబ్బులు పట్టి పలుచోట్లు వర్షం కురుస్తోంది. తాజాగా.. సోమవారం సైతం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో రాబోయే 24 గంటల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు పడతాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, రాబోయే రెండు రోజుల్లో నగరంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

Advertisement

Next Story