ఇకపై అంబులెన్సులు సైరన్ మోగించొద్దు

by vinod kumar |   ( Updated:2021-05-19 08:12:48.0  )
ambulance sirens
X

ఇంపాల్: కరోనా పేషెంట్లను తరలిస్తూ అంబులెన్సులు చేస్తున్న సైరన్ మోతలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని మణిపూర్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాబట్టి అంబులెన్స్‌లు సైరన్‌లు మోగించవద్దని సూచించింది. ఒకవేళ రోడ్డుపై రద్దీ ఉంటేనే సైరన్ యాక్టివేట్ చేయాలని తెలిపింది. చీఫ్ మెడికల్ అధికారులు, మెడికల్ సూపరింటెండెంట్లు, ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది, ఆంబులెన్స్ ఆపరేటర్లను రాష్ట్ర మెడికల్ డైరెక్టరేట్ ఈ మేరకు ఓ మెమోరాండంలో కోరింది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇంఫాల్ సహా పలుపట్టణాల్లో ఈ నెల 8న నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 28 వరకు పొడిగించింది. రాష్ట్రంలో తాజాగా, 624 కొత్త కేసులు నమోదవ్వగా 20 మంది కరోనాతో మరణించారు.

Advertisement

Next Story

Most Viewed