ఉరిశిక్ష వేయాలని వైఎస్ఆర్ టీపీ నాయకుల ఆందోళన

by Shyam |
TSR TP
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాల‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయ‌కులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలని చంపాపేట్ కాలనీలో శుక్రవారం ఆందోళ‌న చేప‌ట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందించాలన్నారు. అంతేకాక అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సుమన్ గౌడ్, నాగర్ కర్నూల్ జిల్లా కోకన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి, పార్టీ యూత్ క‌మిటీ మెంబ‌ర్ రమేశ్ నాయక్, సంతోశ్, శేఖర్, శ్రీకాంత్, రమేశ్, బాలాజీ, శివ ఉన్నారు.

Advertisement

Next Story