దారుణం.. అంకుల్ అన్నందుకే అంతపని చేసిన దుర్మార్గుడు..

by Sumithra |
దారుణం.. అంకుల్ అన్నందుకే అంతపని చేసిన దుర్మార్గుడు..
X

దిశ, వెబ్ డెస్క్: కేవలం అంకుల్ అని పిలిచినందుకే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఉత్తరాఖండ్ లోని సితర్ గంజ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలిక బ్యాడ్మింటన్ ఆడటం కోసం రాకెట్ కొనుక్కుంది. ఆట మధ్యలో అది పాడైపోయింది. అంత త్వరగా పాడైపోవడంతో షాప్ దగ్గరికి వెళ్లింది. షాప్ లో ఎవరూ లేక పోవడంతో అంకుల్ ఎవరైనా ఉన్నారా అని పిలిచింది. అయితే నన్నే అంకుల్ అంటావా అని మోహిత్ అనే యజమాని బయటకు వచ్చాడు.

జుట్టు పట్టుకుని ఆ అమ్మాయిని నేలకే కొట్టాడు. అక్కడితో ఆగకుండా విచక్షణా రహితంగా కొట్టాడు. దాంతో ఆ బాలిక అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అది గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఆ బాలికను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మోహిత్ ను అరెస్ట్ చేశారు. అతడి పై ఐపీసీ323, 354,506 ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed