గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో వ్యక్తి మృతి

by Sumithra |   ( Updated:2021-09-20 07:50:45.0  )
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో వ్యక్తి మృతి
X

దిశ, గూడూరు : ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తేజావత్ రామ్ సింగ్ తండా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమ్లా తండాకు చెందిన బానోత్ చిన్నా (35) రోజు మాదిరిగానే మూడు రోజుల క్రితం ఉదయం పొలం పనికి వెళ్లి సాయంత్రం వచ్చాడు. చిన్నా ఇంటికి వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వస్తుండడంతో అదుపు చేసే ప్రయత్నం చేస్తుండగా సిలిండర్ పేలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నాను హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story