- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
by Sumithra |
X
దిశ, జడ్చర్ల : బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తపల్లి శివారులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన చాకలి భాస్కర్ (30) తన ద్విచక్రవాహనంపై మిడ్జిల్ నుండి తన సొంత గ్రామమైన ఉదండాపూర్ కు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో కొత్తపల్లి శివారులోని రెడ్డి గూడా కమాన్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో తలకు తీవ్ర గాయాలై భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో మిడ్జిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story