- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వినాయక మండపంలో మద్యంబాబు వీరంగం.. ఏం చేశాడంటే ?
దిశ, కామారెడ్డి : మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. వినాయక మండపంలోకి చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. గమనించిన నిర్వాహకులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలం లక్ష్మీరావుల పల్లి గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి గ్రామంలోని వినాయక మండపం వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో మండపంలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న మండప నిర్వాహకులు గంగాధర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో మండపంలోని వినాయక విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గంగాధర్‌ను పోలీసులకు అప్పగించారు. అయితే గత దసరా ఉత్సవాల వేడుకల్లో కూడా గంగాధర్ ఇదే విధంగా మద్యం సేవించి గలాటా సృష్టించాడని గ్రామస్థులు తెలిపారు.