చికెన్ ఉద్దెర ఇవ్వలేదని..

by Sumithra |
medchal 1
X

దిశ, చేవెళ్ల : చికెన్ ఉద్దెర అడుగుతే ఇవ్వనందుకు యజమాని పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. చేవెళ్ల సర్కిల్ ఇన్స పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 4 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం వచ్చిన కటిక నర్సోజు(30) చేవెళ్ల మండలం బస్తే పూర్ గ్రామంలో స్థిరపడ్డాడు. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ చికెన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి శనివారం రాత్రి వచ్చి చికెన్ కావాలని అడిగాడు. చికెన్ లేదని చెప్పడంతో ఇంటికి వెళ్లి మళ్ళీ అరగంట తర్వాత వచ్చి చికెన్ ఇస్తావా లేదా అంటూ గొడవకు దిగాడు. అతను మళ్లీ లేదని గట్టిగా చెప్పడంతో ఆగ్రహానికి గురైన అనిల్ చికన్ దుకాణంలోనే ఉన్న కత్తితో దుకాణం యజమానిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నర్సోజును చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చేవెల్ల సర్కిల్ ఇన్స్‌పెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed