- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉదయాన్నే మొదటిసారిగా తెరిచిన ఆ షాప్.. ఎగబడుతున్న జనాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. బుధవారం ఉదయం 6 గంటల నిత్యావసరాల దుకాణాలు తెరుచుకున్నాయి. నిత్యావసరాల్లో ఒకటిగా ప్రభుత్వం భావించిన మద్యం దుకాణాలు కూడా ఓపెన్ అయ్యాయి. అబ్కారీ చరిత్రలో ఇంత ఉదయమే వైన్ షాపులు తెరుచుకోవడం ఇదే ప్రథమం. ఉదయం తెరుచుకున్నా మద్యం దుకాణాల్లో గిరాకీకి కొదువ లేదని రుజువైంది. ఉదయం నుంచి పాలు, కూరగాయలు, కిరాణా సరుకుల కోసం వెళ్లేవారితో సమానంగా మద్యం దుకాణాలకు కూడా వెళ్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు మూతపడనున్న విషయం తెలిసిందే. అత్యవసర దుకాణాలు మినహా… అన్నీ తాళాలు పడనున్నాయి. నిత్యావసరాల కోసం 10 గంటల వరకు ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో ఇవ్వాళ ఉదయం నుంచే వినియోగదారులు రోడ్లెక్కారు. అటు మద్యం దుకాణాలు బంద్ చేస్తారనే అనుమానంతో మంగళవారమే వైన్స్‌ల ముందు మందుబాబులు కిక్కిరిశారు. అయితే అన్నింటితో పాటుగా వీటికి కూడా సడలింపు రావడంతో… ఉదయం వేళల్లో తెరిచారు. అయినా ఆయా ప్రాంతాల్లో మందుబాబులు తెల్లవారంగానే మందు కోసం వెళ్తున్నారు.