- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మత మార్పిడుల పై కొత్త బిల్లు.. రుజువైతే ఘోరమైన శిక్షలు..
దిశ, వెబ్ డెస్క్: రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించవచ్చు, అభివృద్ది చేసుకోవచ్చు. అయితే బలవంతంగా ఎవరినీ మతం మార్చరాదు. దీనిపై కర్నాటక ప్రభుత్వం కీలం చట్టం తీసుకు రావడానికి సిద్దమైంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ‘కర్నాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు-2021’ తీసుకురావడానికి డ్రాఫ్ట్ బిల్లును తయారు చేసుకుంది. దీని ప్రకారం రాష్ట్రం లో ఎవరు బలవంతంగా మతం మార్చినా శిక్షార్హులే అవుతారు.
ఈ డ్రాఫ్ట్ బిల్లు లో అనేక నిబంధనలు పేర్కొన్నారు. ఎవరైనా సరే ఇతరులను బెదిరించి, ఏదైనా ఆశ చూపి, బలవంతంగా మతం మార్చినట్లైతే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, 50 వేల రూపాయల వరకూ జరిమాన విధించనుంది కర్నాటకా ప్రభుత్వం. ఇక అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ లలోని మైనర్లు, మహిళలు, బధిరులు లాంటి వారిని మతం మార్చడానికి ప్రలోభాలకు గురి చేసినా శిక్షతప్పదు. ఈ నేరం రుజువు అయితే 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50 వేల వరకూ జరిమానా కూడా విధిస్తారు. ఒక మతం నుంచి మరో మతంలోకి మారేలా ప్రేరేపించినా.. వాళ్లకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 25 వేల జరిమానా విధిస్తారు. సామూహికంగా మతం మార్చినట్టు రుజువు అయితే 3నుంచి 10 సంవత్సరాల శిక్ష పడుతుంది.
మతం మార్చడం కోసం ఏవైనా మిషనరీలు, వృద్దాశ్రమాలు, అనాథ శరణాలయాలు, విద్యా సంస్థలు పని చేసినట్టు తెలిస్తే వాటికి తక్షణమే నిధులు నిలిపివేస్తారు. అక్కడ బలవంతగా మతం మారిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో నాన్ బెయిలబుల నేరంగా కూడా ప్రభుత్వం చూడవచ్చు. వీటితో పాటు మతం మార్చడం కోసం బహుమతులు గానీ, ధనం గానీ ఆశ చూపినట్టు రుజువు అయితే వాటిని కూడా నేరంగానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బిల్లు కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది సమావేశాలు ముగిస్తే తప్పా తెలియవు.