- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ అధికారులమంటూ హల్చల్.. 35 తులాల బంగారం, నగదుతో ఎస్కేప్..
దిశ, శేరిలింగంపల్లి: అచ్చం ఐటీ అధికారుల్లాగే సూటు బూటు వేసుకుని వచ్చారు. మేము ఐటీ అధికారులం, మీ ఇంట్లో సోదాలు చేయాలంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఇల్లంతా వెతికి కాగితాలు వదిలేసి, ఇంట్లో దొరికిన 35 తులాల బంగారం, లక్షా 75 వేల నగదు కాజేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. వచ్చిన వాళ్లు ఎవరో తేల్చుకునే లోపే జంప్ అయ్యారు. ఈ ఫేక్ ఐటీ ముఠాపై బాధితురాలు భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ముఠాను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు.
నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలోని సీ బ్లాక్ లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఐటీ అధికారులమంటూ వారి ఫోన్లు తీసుకుని తమ దగ్గర పెట్టుకున్నారు. భాగ్యలక్ష్మి దగ్గర లాకర్ తాళాలు తీసుకొని అందులోని 35 తులాల బంగారం, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయారు. తనకు ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, తీసుకెళ్తున్న నగదు వివరాలు అందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు గచ్చిబౌలి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.