పొద్దునే గురువు గారితో గుడిలో.. రాత్రేమో గురువుగారి భార్య ఒడిలో

by Sumithra |   ( Updated:2021-05-11 01:18:39.0  )
పొద్దునే గురువు గారితో గుడిలో.. రాత్రేమో గురువుగారి భార్య ఒడిలో
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువవుతున్నాయి. వీటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది చిన్నారులు అనాధలుగా మారుతున్నారు. క్షణికావేశంలో భార్యాభర్తలు చేసే ఇలాంటి పనుల వలన కుటుంబాల్లో ప్రశాంతత కరువవుతుంది. తాజాగా ఒక పూజారి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను కత్తితో పొడిచి హత్య చేసి, పోలీసుల వద్ద లొంగిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో చెన్నబసవ అనే వ్యక్తి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఆయనకు గౌరమ్మ అనే భార్య ఉంది. అయితే గత కొద్దీ రోజుల క్రితం ఆలయంలో పనులు ఎక్కువ కావడంతో సహాయకుడిగా ఒక పాతికేళ్ల కుర్రాడిని నియమించుకున్నాడు పూజారి. ఇక ఆ యువకుడు మాత్రం పూజారి భార్య గౌరమ్మ మీద కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను లోంగబర్చుకున్నాడు.

అసిస్టెంట్ తన భార్యని వలలో వేసుకుని కామ క్రీడలు సాగిస్తున్న విషయం తెలుసుకున్న పూజారి పలుమార్లు వారిద్దరిని హెచ్చరించి వదిలేశాడు. ఇకనుండైనా మంచిగా ఉండాలని భార్యకు నచ్చజెప్పాడు. అయినా భార్య, భర్త మాటను పెడచెవిన పెట్టింది.ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం వారిద్దరూ ఇంట్లో ఉండగా పూజారి చూశాడు. దీంతో కోపోద్రేకుడైన పూజారి చెన్నబసవ ఇంట్లో ఉన్న కత్తితో భార్యను పొడిచి హత్య చేశాడు. అనంతరం కత్తితో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీ లో ఉన్న యువకుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story