Extra-marital sex affairs-భర్తతో వెళ్లిన భార్య మరొకరితో ఎఫైర్.. పారకర్రతో..

by Sumithra |   ( Updated:2021-06-02 05:39:52.0  )
Illegal affair
X

దిశ, వెబ్‌డెస్క్ : క్షణకాలం ఆనందం కోసం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను రోడ్డున్న పడేస్తున్నాయి. కాయకష్టం చేసుకుని జీవించే కుటుంబంలోకి కామ పిశాచి బుసలు కొట్టడంతో ఓ కుటుంబం చెల్లాచెదురైంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యను భర్త హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..

పదేళ్ల క్రితం సువర్ణ(32), రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామం. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు జన్మించారు. రెండేళ్ల క్రితం దంపతులు ఇద్దరు జీవనోపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో ఇల్లు అద్దెకు తీసుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొన్నాళ్లుగా దంపతులు ఇద్దరు ఒకే మేస్త్రీ వద్దకు కూలికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో సువర్ణ పనిచేసే చోట ఓ వ్యక్తిత్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన భర్త రాజు పలుమార్లు సువర్ణను హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా సువర్ణలో మార్పు రాలేదు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికిలోనైన రాజు.. కోపంతో పార కర్రతో భార్య తలపై కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. సువర్ణ బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితుడు రాజుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్య హతమవడం.. భర్త జైలుకు వెళ్లడంతో ముగ్గురు చిన్నారులుగా అనాథలుగా మారారు. తల్లిదండ్రుల కోసం వారు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

Advertisement

Next Story