మంత్రి కేటీఆర్‌ను కలిసిన హెచ్ఏఐ ప్రతినిధులు.. ఎందుకంటే!

by Shyam |   ( Updated:2020-12-24 07:05:10.0  )
మంత్రి కేటీఆర్‌ను కలిసిన హెచ్ఏఐ ప్రతినిధులు.. ఎందుకంటే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి మండలి ఏర్పాటు, ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను హోటల్​ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. ఇటీవల హెచ్ఏఐ సభ్యుడు ఐయన్ దూబియర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కరోనా నేపథ్యంలో ఆతిథ్య రంగం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం విధానపరమైన జోక్యం చేసుకోవాలని ఐయాన్ దూబియర్ కోరారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత హోటళ్ల పున:ప్రారంభానికి ప్రభుత్వం అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఆతిథ్య రంగం పూర్వ వైభవానికి ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమన్నారు.

2019లో 8.3కోట్ల మంది పర్యాటకుల సందర్శనతో దేశంలోనే అగ్రశ్రేణి 10రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. 2019లో విదేశీ పర్యాటకులను స్వీకరించిన విమానాశ్రయాల్లో శంషాబాద్ 8వ స్థానంలో నిలిచింది. మరింత ముందుకు వెళ్లేందుకు తెలంగాణలో శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌కు హెచ్ఐఏ ప్రతినిధులు వివరించారు. ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాలన్న తమ అభ్యర్థన పట్ల మంత్రి కేటీఆర్ అధికారుల నుంచి సానుకూల స్పందన లభించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed