- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందుర్తిలో పరిపాటి వెంకట్రామిరెడ్డి ఫ్యామిలీ ఘన చరిత్ర
దిశ, ఓదెల: సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి తల్లిదండ్రులు-స్వస్థలంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన పరిపాటి రాజిరెడ్డి.. 1983, 85 పాత తాలూకా సుల్తానాబాద్‌లో వకీలుగా పని చేసి ఈ ప్రాంత ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజిరెడ్డి-పుష్పలీలకు ఆరుగురు సంతానం. (జయచంద్ర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకట్రామిరెడ్డి విజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి). చిన్నతనంలోనే ఊరినుంచి వెళ్ళిపోయి పట్నంలో స్థిరపడి ఉన్నత చదువులు అభ్యసించి.. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో నిలిచారు.
గతంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఈ కుటుంబం ఎడ్లబండిపై వచ్చి మొక్కులు తీర్చుకునేవారు. ఒకానొక సమయంలో రాజిరెడ్డి కుటుంబ సభ్యులు జాతరకు వచ్చిన వేళ అకాల వర్షం పడింది. దీంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యే వారని.. ఆ భక్తుల బాధలు చూడలేక వెంకట్రామిరెడ్డి తల్లి అయిన పుష్పలీల.. మీరు ఏ స్థాయికి ఎదిగినా మంచిదే కొడుకుల్లారా.. కానీ, ఇక్కడికి వచ్చే భక్తులకు మన లెక్క ఇబ్బందులు కలగకుండా నీడ ఇవ్వాలని కోరింది. తల్లి మాట ప్రకారం వారి పేరిట ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో సత్రాలు ఏర్పాటు చేశారు కుమారులు.
ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు.. వారు కట్టించిన సత్రాలను ఉపయోగించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక అయినంక ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో అనేక అభివృద్ధి జరుగుతుందని ఓదెల మండల ప్రజలు భావిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయులు గీట్ల ముకుందరెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం విశేషం. దీనికితోడు ఇందుర్తి గ్రామంలో పరిపాటి ఫ్యామిలీని ఆ గ్రామస్తులు నెమరేసుకుంటూనే ఉంటారు.