- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే..?
దిశ, వెబ్ డెస్క్: వచ్చే నాలుగు రోజులపాటు మీరు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రాజారాంపల్లిలో అత్యధికంగా 47.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. అదేవిధంగా ఇదే జిల్లాలోని ధర్మపురిలో 47 డిగ్రీలు, నేరెళ్లలో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, వడ గాలులు వీచే అవకాశముందని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.