దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం

by srinivas |
ap-highcourt 1
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. వాస్తవానికి సెప్టెంబర్ 24న ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే టీడీపీ ఎంపీపీ అభ్యర్థి జమీన్ కుల ధృవీకరణ పత్రం సమర్పించకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఈ అంశంపై గురువారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. జమీన్ కుల ధృవీకరణ పత్రం సమర్పించే వరకు ఎన్నిక నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జమీన్ కుల ధృవీకరణ పత్రం కోసం కలెక్టర్‍కు అప్పీల్ చేశారు. వారం రోజుల్లో ఎంపీపీ అభ్యర్థి జమీన్ అప్పీల్‍ను పరిష్కరించాలని కలెక్టర్‍ వివేక్ యాదవ్‌ను హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story