- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. వాటిపై ఆంక్షలెందుకు లేవు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు వేగంగా విస్తరిస్తూ ఉంటే మద్యం దుకఆణాలు, బార్లు, పబ్‌లు, సినిమా థియేటర్లు లాంటి జనం గుమికూడే ప్రాంతాల్లో ఆంక్షలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు లాంటి సందర్భాల్లో రద్దీ ఏర్పడకుండా, ప్రజలు గుమికూడకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు లాంటి ఎక్కువ మంది పోగయ్యే ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం వివరాలను అందించాలని ఆదేశించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వానికి బెంచ్ కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న కట్టడి చర్యలపై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ నివేదిక సమర్పించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలను తక్కువ సంఖ్యలో చేస్తున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిగా రాపిడ్ టెస్టులు (యాంటీజెన్) టెస్టులపైనే దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించింది. మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు కనీసం పది శాతం కూడా లేవని తప్పుపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని పరీక్షల సంఖ్యను నెమ్మదిగా పెంచుతున్నామని వివరించారు. కానీ దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు కరోనా వేగంగా విస్తరిస్తూ ఉంటే పరీక్షల సంఖ్యను నెమ్మదిగా పెంచడమేంటని నిలదీసింది.
ఇకనైనా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స ఏయే ఆసుపత్రుల్లో, వైద్య కేంద్రాల్లో అందిస్తున్నారో ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టంచేసింది. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నొక్కిచెప్పింది. కరోనా నిబంధనలు అమలుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటించనివారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలను 48 గంటల్లోగా నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది.