- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వధువుకు కుంకుమ దిద్దుతున్న వరుడు.. అంతలోనే ప్రియుడు వచ్చి
దిశ, వెబ్‌డెస్క్: అదొక కల్యాణ మండపం.. వేదికపై వధూవరులు నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. బంధువులు, స్నేహితులు ఎప్పుడెప్పుడు పెళ్లి చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పంతులు గారు మంత్రాలూ చదువుతూ వధూవరులను దండాలు మార్చికోమని ఆదేశించారు. వారు అలాగే చేశారు. చివరి ఘట్టంగా వధువుకు మెట్టెలను అలకరించి, నుదుటన కుంకుమ పెట్టాలి. వరుడు చేతిలో కుంకుమ తీసుకొని వధువు నుదుటున పెట్టబోయేలోపు.. హఠాత్తుగా ఓ యువకుడు పెళ్లిపందిరి లోకి దూసుకొచ్చాడు. వరుడును పక్కకు నెట్టి వధువు నుదిటిపై కుంకుమ పెట్టాడు. ఇదేంటి.. ఇదేదో సినిమా కథలా ఉందే అని అనుకొంటున్నారా..? కాదండి ఇది ఒరిజినల్ గా యూపీలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తీ వివరాలు ఇలా ఉన్నాయి.
యూపీలోని గోరఖ్‌పూర్ కి చెందిన ఒక యువతిని గోలు విశ్వకర్మ అనే యువకుడు ప్రేమించాడు. కానీ, ఆ విషయాన్ని యువతికి తెలుపలేదు.. వన్ సైడ్ లవ్ చేస్తూ యువతిని దూరంగా ఉండి ప్రేమించేవాడు. అయితే యువతికి వారి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఆమెను చూడడం మానేసాడు. నీ సుఖమే నే కోరుతున్నా అనుకొంటూ.. ఆమె పెళ్ళికి హాజరయ్యాడు. కానీ, ప్రేమించిన అమ్మాయి వేరేవాడి సొంతమవుతుంటే భరించలేని యువకుడు హఠాత్తుగా పెళ్లి వేదికపైకి వెళ్లి వరుడును పక్కకు నెట్టి వధువు నుదిటిన కుంకుమ పెట్టాడు. అడ్డొచ్చిన వరుడికి గొడ్డలి చూపించి అడ్డుకొంటే నరికేస్తానని బెదిరించాడు. ఇక ఇదంతా చూస్తున్న బంధువులు ఒక్కసారి షాక్ కి గురయినా వెంటనే తేరుకొని యువకుడ్ని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన తరువాత వరుని తరుపువారు వధువును తమతో పాటు తీసుకువెళ్లమనీ..ఆమెతో మాకు సంబంధం లేదనీ..సదరు యువకుడికి..వధువుకు మధ్య ఏదో ఉందని అందుకే అతను అంత చొరవగా వచ్చి కుంకుమ పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకెటువంటి సంబంధం లేదని, అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని వధువు తెలుపడంతో వరుడు తనని ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి గోరఖ్ పూర్ లో సంచలనం గా మారింది.