- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది చేసింది రైతులు కాదు ఉగ్రవాదులు అని తప్పు దోవ పట్టించారు.. చుక్కా రాములు
దిశ, పటాన్‌చెరు: సాగుచట్టాల రద్దు కోసం సంవత్సర కాలంగా రైతులు కేంద్ర పాలకులపై పోరాడి విజయం సాధించడం గొప్ప విజయంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అభివర్ణించారు. శుక్రవారం పటాన్‌చెరు పారిశ్రామి వాడలోని శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమం ప్రారంభించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సీఐటీయూ అఖిల భారత పిలుపులో భాగంగా జరిగిన విజయ్ దివాస్‌లో ప్లకార్డ్‌లు ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చుక్కా రాములు హాజరై మాట్లాడుతూ.. భారత జాతీయోధ్యమం తర్వాత అంతటి స్థాయిలో రైతులు అత్యంత ప్రతికూల పరిస్థితులలో కరోనా మహమ్మారి, చలి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వీరోచితంగా చేస్తున్న పోరాటం సంవత్సరం పూర్తి చేసుకుందని గుర్తు చేశారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇది రైతులు చేస్తున్న పోరాటం కాదని, ఈ ఉద్యమంలో రైతులు లేరని ఉగ్రవాదులు ఉన్నారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, రైతులను వాహనాలతో తొక్కి చంపినా రైతులు మొక్కవోని దీక్షతో చేసిన పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని అన్నారు. ఇది కార్మిక, కర్షక విజయమని తెలిపారు. ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని, కానీ రైతు సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రధాని ప్రకటన చేయడం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని సూచిస్తున్నదని విమర్శించారు. ఇవే కాక అనేక రైతుల డిమాండ్లు పరిష్కరించాల్సి ఉందని, కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం చెయ్యాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పారు. ఈ పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, అప్పటివరకూ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. రైతు సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో సీఐటీయూ ఈ పోరాటానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
రైతులు, కార్మికులు కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని కార్పొరేట్ శక్తులు సహించలేక పోతున్నాయని అన్నారు. రైతు పోరాట స్పూర్తితో భారత కార్మికవర్గం జెండాలకు అతీతంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేసేవరకూ ఐక్యంగా పోరాడాలని తెలిపారు. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ఇప్పుడు ఉన్న రాజ్యాంగాన్ని బలహీనం చేయడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలను త్రిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవడానికి కార్మిక వర్గం ముందుండి పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.